సార్వత్రిక ఎన్నికల వేళ మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ బిగ్ రిలీఫ్ దొరికింది. అవినీతి కేసులో ఆయనకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో ఆయనకు భారీ ఊరట లభించింది. ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్‌కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Priyank Kharge: కర్ణాటక మంత్రికి బెదిరింపులు.. “మనువాదుల” పనే అంటూ విమర్శలు..
2017లో నమోదైన అవినీతి కేసులో ఆయన ప్రమేయం లేదంటూ సీబీఐ తేల్చిచెప్పింది. ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్‌తో పాటు, ఆ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులపై మే 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. దాదాపు ఏడేళ్లపాటు సుదీర్ఘ విచారణ చేపట్టిన అత్యున్నత దర్యాప్తు సంస్థ.. ఈ కేసుతో ఆయనకు సంబంధం లేదని విచారణను ముగించింది. ఆయనతో పాటు అప్పటి అధికారులకు కూడా కేసు నుంచి బయటపడ్డారు.
ఇది కూడా చదవండి: Bengaluru cafe blast: రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో కీలక నిందితుడి అరెస్ట్..