ప్రధాని మోడీ ముందు తన భర్త కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచరని సునీతా కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలో సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు శనివారం ఆప్ ప్రకటించింది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో శనివారం సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్ బిగ్ రిలీఫ్ దొరికింది. అవినీతి కేసులో ఆయనకు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో ఆయనకు భారీ ఊరట లభించింది.