Cat Snake Fight : పాము – ముంగిస, పిల్లి – ఎలుక ఒకదానికొకటి బద్ద శత్రువులు. సాధారణంగా ఈ జంతువులు పోట్లాడుకోవడం మీరు చూసే ఉంటారు. జంతువుల పోరాటం, వేట వీడియోలను చూసి ఉంటారు. అయితే పాము, పిల్లి ఒకదానితో ఒకటి పోట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా? ఈ పోరులో ఎవరు గెలుస్తారు అని అడిగితే పాము అని ఠక్కున చెప్పేస్తాం. అయితే పిల్లి, పాము ఎదురుగా వస్తే ఏం జరుగుతుందో తెలిపే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Viral: ఆ ప్రాంతంలో ప్లేట్ తన్నుతూ భర్తలకు భోజనం పెడతారు.. ఎందుకో తెలుసా?
పిల్లి – పాము మధ్య పోరాటం జరిగింది. ఒక ప్రమాదకరమైన పాము నిశ్శబ్దంగా కూర్చున్న పిల్లితో గొడవకు దిగింది. పిల్లిపై దాడి చేసేందుకు పాము పాకింది. పిల్లి మెడకు ఉచ్చులా పెనవేసింది. పాము మెడపైకి రావడంతో పిల్లి కూడా ప్రతిఘటించడం ప్రారంభించింది. పాము పిల్లి చుట్టూ తన తోకను చుట్టి, కాటు వేయడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో పిల్లి దానిపై కాళ్లుతో తన్నింది. పిల్లి కూడా ఈ పాముకి గట్టిపోటీ ఇచ్చింది. పాము బారి నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదని గ్రహించిన వెంటనే పిల్లి తన ఆఖరి ఎత్తుగడ వేస్తుంది. పోరుకు వచ్చిన పాము పిల్లికి బలైపోయింది. ఇంతకు ముందు ఇలాంటి వీడియో చూసి ఉండకపోవచ్చు.
Cat, Pet animal, Snake, Viral, Viral videos, Wild animal