Amit Shah: రూల్స్ బ్రేక్ చేశారు.. అమిత్ షా పై కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: మొఘల్ పురా పోలీసు స్టేషన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ పీసీసీ వైఎస్ ప్రెసిడెంట్ జి. నిరంజన్ ఢిల్లీ లో ఎన్నికల ప్రధాన అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ నెల1 వ తేదీన పాతబస్తీ పర్యటన సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ బ్రేక్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమిత్ షా ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్ పై కమలం పువ్వు గుర్తు ఉందని, ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బాత్ 400 పార్ అంటూ రాసి ఉందని పేర్కొన్నారు. ఇది ఎలక్షన్ రూల్స్ బ్రేక్ చేశారని ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమాలను బీజేపీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.
Read also: SSMB29 : మహేష్, రాజమౌళి కాంబినేషన్ మూవీ మరింత ఆలస్యం కానుందా..?
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
మే 1న పాతబస్తీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాధవి లత మాట్లాడుతుండగా ఇద్దరు మైనర్ బాలికలు వేదికపైకి వచ్చారు. అమిత్ షా అమ్మాయిలను తన వద్దకు రమ్మని సైగ చేయడంతో అమ్మాయిలు షా వద్దకు వెళ్లారు. ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్లో తామర పువ్వు గుర్తు.. మరో ఇద్దరు చిన్నారులు ఆప్ కీ బార్ 400 పార్ అంటూ ప్లకార్డులు కలిగి ఉన్నారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశాడు.. దీనిపై స్పందించిన EC జరిగిన సంఘటన పై విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ కు ఆదేశించారు. సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహారాకు ఆదేశాలు జారీ చేశారు. మొఘల్ పురా పోలీసులు విచారణ చేసి క్రైం నెంబర్ 77/2024, సెక్షన్ 188 ఐపీసీ క్రింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. A1)యమాన్ సింగ్, A2)హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత, A3) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. A4) రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి A5) MLA రాజసింగ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
AP Pensions: నేటి నుంచి ఇంటి వద్దే పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం ఆదేశాలు
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!