Carlos Alcaraz : డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్ ను మరోసారి గెలుచుకున్నాడు. నేడు ఆదివారం జులై 14 2024 జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్ ను వరుస సెట్స్ లో ఓడించి వరుసగా రెండో సారి చాంపియన్ అయ్యాడు. మొదటి సెట్ నుండే దూకుడును ప్రదర్శించిన అల్కరాజ్ నిర్ణయాత్మక మూడో సెట్ లోనే ఆటను పూర్తి చేసాడు. 6-2, 6-2, 7-6 తో నొవాక్ జకోవిచ్ ను వణికించి ట్రోఫీని ముద్దాడాడు. దాంతో సింగిల్స్ లో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవాలనుకున్న కల కలగానే మారింది.
Health Tips: వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. చాలా ప్రమాదం..
ఇక ఈ టోర్నీ మొదలైనప్పటి నుండి అల్కరాజ్ అదరగొట్టాడు. సెమీఫైనల్లో డానిల్ మెద్వెదేవ్ ను మట్టి కరిపించిన ఈ స్పెయిన్ బుల్ ఆదివారం స్పెయిన్ కోర్టులో తన సత్తా చాటాడు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన అల్కరాజ్ వరుస సెట్స్ లో ఎంతో ప్రావిణ్యం ఉన్న నొవాక్ జకోవిచ్ ను ఓడించి వరుసగా రెండోసారి టైటిల్ ను పొందాడు. మొదటి రెండు సెట్లను కాస్త సునాయాసంగానే గెలిచిన అల్కరాజ్ కు మూడో సెట్ లో కాస్త గట్టి పోటీ ఏర్పడిన మొత్తానికి విజయం సాధించాడు.
Salt: ఉప్పు అధికంగా తినడం వల్ల చాలా ప్రమాదం..డబ్య్లూహెచ్ వో ఏం చెప్తోంది..
ఇక మ్యాచ్ విజయం తర్వాత ప్రేక్షకులకు విజయాభివందనం చేసి.. విజిటర్స్ గ్యాలరీ లోకి వెళ్లి తన టీమ్‌మేట్స్ తో కలిసి సంబురాలు చేసుకున్నాడు. గతఏడాది వింబుల్డన్ ఫైనల్లోనూ అల్కరాజ్ చేతిలో జకోవిచ్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం 21 ఏండ్ల వయసులోనే రెండో వింబుల్డన్ టైటిల్ గెలిచిన అల్కరాజ్ టెన్నిస్ చరిత్రలో మరో నూతన శకం మొదలైందని చాటుతున్నాడు.
To win here is special. To defend here is elite.
Carlos Alcaraz is the 2024 Gentlemen’s Singles Champion 🏆#Wimbledon pic.twitter.com/kJedyXf0vn
— Wimbledon (@Wimbledon) July 14, 2024