తూర్పు ఢిల్లీ లోని ఘాజీపూర్ లో బుధవారం రాత్రిరద్దీగా ఉండే మార్కెట్ లోకి అస్మాత్తుగా ఓ కారు దూసుకొచ్చింది. ఆ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన జనాల్లో ఓ 22 ఏళ్ల మహిళ మృత్యువాత చెందింది. వీరితోపాటు మరో 15 మంది గాయలపాలైయ్యారు. ఈ సంఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు యాక్షిడెంట్ కు కారణమైన ఆ ట్యాక్సీ డ్రైవర్ ను పట్టుకుని చితకబాదారు. ఆపై మరికొంత మంది పోలీసులకు సమాచారాన్ని అందించారు.
Also read: Viral: ఎలావస్తాయో ఇలాంటి ఐడియాలు.. ట్రాఫిక్ జామ్ లో ఆ మహిళ చేసిన పనిచూస్తే వావ్ అనాల్సిందే..!
ఆపై అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై గాయపడిన వారిని సమీపంలోని లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రికి తరలించారు. ఇకపోతే యాక్షిడెంట్ కు కారణమైన ఆ ట్యాక్సీ డ్రైవర్ మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇకపోతే ప్రమాదం జరిగిన సమయంలో మార్కెట్ అంతా జనంతో నిండుగా ఉంది. ఈ క్రమంలో కారు వెనుక నుంచి వచ్చి యాక్షిడెంట్ చేసిందని స్థానికులు చెబుతున్నారు.
Also read: Viral: ఎవర్రా మీరంతా.. ఒక్కసారిగా వధువుపై పడ్డ అతిథులు.. చివరకి..?!
ఇక ఈ ట్యాక్సీ విషయానికి వస్తే మయూర్ విహార్ ఫేజ్ 3 వైపు వెళుతుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ వాహనం అదుపు తప్పి ఒక్కసారిగా ఎడమవైపు తిరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ యాక్షిడెంట్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ సమయంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండి డ్రైవింగ్ చేశాడా..? లేదా మరో కారణం ఉందా అనే కోణాల్లో కూడా సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు.
STORY | 22-year-old woman killed after car mows down people in Delhi
READ: https://t.co/t6fkhLgn0L
VIDEO: pic.twitter.com/rkyg6LGWyP
— Press Trust of India (@PTI_News) March 13, 2024