Threat Call : గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ చేశారు. సోమవారం అర్థరాత్రి 12 గంటలకు పీసీఆర్ కాల్ చేసినట్లు కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు. బెదిరింపు కాల్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేజ్రీవాల్‌ను చంపేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాల్ చేసిన వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అతను ఢిల్లీలోని గులాబీ బాగ్ హాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Mountain of cash: గుట్టల కొద్ది డబ్బు.. బ్యాగుల్లో తీసుకెళ్లిన ఉద్యోగులు
నిందితుడి పేరు జై ప్రకాష్ అని, అతని మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసులు తెలిపారు. బెదిరింపు ఫోన్ కాల్ రాగానే వెంటనే ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేశామని పోలీసులు తెలిపారు. పోలీస్ సిబ్బంది నిమిషాల వ్యవధిలోని జై ప్రకాష్ వద్దకు చేరుకొని అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేశారని, అయితే, అతడు మానసిక వికలాంగుడు కావడంతో అరెస్టు చేయలేదని అన్నారు. క్షణికావేశంలో ఇలా బెదిరింపు కాల్ చేసినట్లు జై ప్రకాష్ తెలిపాడని అన్నారు.
Read Also: Taraka Ratna Health : హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తారకరత్న