Gun Fire: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ కీచకుడు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ఆస్పత్రి పాలైంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నంద్ నగ్రిలో సోమవారం 16 ఏళ్ల బాలికపై ఆమె స్నేహితుడే కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన తర్వాత అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం ఢిల్లీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. దీంతో పాటు ఆ ప్రాంతంలో పోలీసు బలగాలను మోహరించారు.
Read Also : Hardik Pandya : టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డ్
బాధితురాలు స్థానిక జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయం విచారణలో ఉంది. సోమవారం రాత్రి నంద్ నగ్రి పోలీస్ స్టేషన్‌లో కాల్పుల ఘటనకు సంబంధించి ఫోన్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని సుభాష్ పార్క్, నంద్ నగ్రి SHO సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా 16 ఏళ్ల మైనర్ బాలికను ఆమె స్నేహితుడు ఖాసిం కాల్చినట్లు గుర్తించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అనేక కోణాలలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 16 ఏళ్ల బాలికకు 19-20 ఏళ్ల వయస్సున్న ఖాసిం స్నేహితుడు. అయితే వీరిద్దరి మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. దీంతో ఖాసింకు కోపం వచ్చి తన తుపాకీతో కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు అయ్యింది.
Delhi | A 16-year-old girl was shot at by her friend/neighbour named Kasim at Subhash Park in Nand Nagri. Victim was taken to GTB hospital, her condition is stable. Efforts underway to nab the culprit: Delhi Police
— ANI (@ANI) March 6, 2023