Haryana: హర్యానాలో ఘరో ప్రమాదం.. స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు రక్షించి వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. హర్యానాలోని మహేంద్రగఢ్ కనీనాలో ఈ ప్రమాదం జరిగింది.
Also Read
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

గురువారం రంజాన్ సందర్భంగా దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు సెలవులు ఉన్నాయి. కానీ హర్యానాలోని జీఎల్ పబ్లిక్ స్కూల్ మాత్రం పాఠశాల నిర్వహిస్తోంది. ఈ ఉదయం విద్యార్థులను తీసుకుని బస్సు స్కూల్ దగ్గరకు వెళ్తుండగా కనీనాలోని ఉన్హాని గ్రామ సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. అధిక సంఖ్యలో గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం పెద్ద ఎత్తున సంఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రమాద స్థలం దగ్గర పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు ఆస్పత్రుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రాథమిక విచారణలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోందని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. జిల్లా యంత్రాంగం గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆరేళ్ల క్రితం 2018లోనే బస్సు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిందని అధికారులు వెల్లడించారు.
#WATCH | Five students dead, 15 injured after a private school bus meets with an accident in Mahendragarh's Kanina, in Haryana. pic.twitter.com/jhRvJo0hXg
— ANI (@ANI) April 11, 2024
తాజావార్తలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
-
Alexander Zverev: జ్వెరెవ్‌కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో కోబోలీపై విజయం
-
Vastu Tips: బెడ్రూమ్లో అద్దం ఏ దిశలో ఉంటే మంచిది? చాలామంది చేసే ఈ పొరపాటు మీ ఇంట్లో కూడా ఉందా?
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!