NTV Telugu Site icon

IND vs AUS: ఆస్ట్రేలియాలో టీమిండియా విఫలమవ్వడానికి కారణం చెప్పిన బుమ్రా..

Jasprit Bumrah Interview

Jasprit Bumrah Interview

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు మాదిరిగానే మూడో రోజు కూడా వర్షం ప్రభావం చూపింది. కాగా.. ఆసీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. అందుకు బదులుగా బరిలోకి దిగిన టీమిండియా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. 44 పరుగుల వ్యవధిలో నలుగురు బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌ బాట పట్టారు. కాగా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. టీమిండియా ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది.

TG Inter Exams: ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలు ప్రకటన

తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో విరాట్‌ ప్రదర్శనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు.. రోహిత్ శర్మ ప్రదర్శనపై కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు.. టీమిండియాలో బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ట్రోఫీలో మొదటి టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి మ్యాచ్‌ను గెలిపించాడు. ఆ తర్వాత టెస్ట్ నుంచి రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టగా.. టీమిండియా ఓడిపోతూనే ఉంది. ఇదిలా ఉంటే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు 18 వికెట్లు తీశాడు. అయితే.. ఈరోజు ఆట ముగిసిన తర్వాత బుమ్రా మాట్లాడుతూ.. “కొత్త ఆటగాళ్లు వస్తున్నందున జట్టులో ఆటగాళ్లు మారుతారు. క్రికెట్ ఆడటానికి ఇది సులభమైన ప్రదేశం కాదు.” అని అన్నాడు.

Guava Juice: చలికాలంలో ఇది ట్రై చేయండి.. ముఖంలో మెరుపు, రోగనిరోధక శక్తి, ఇంకెన్నో లాభాలు

బుమ్రా మాట్లాడుతూ.. “తోటి ఆటగాళ్లకు సహాయం చేయడం నా పని. నేను వారి కంటే కొంచెం ఎక్కువ ఆడాను. కాబట్టి నేను వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. మా జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చారు. వారు జట్టులో ఆడటం.. అనుభవం నుండి నేర్చుకోవాలి.” అని కొత్త బౌలర్లను ఉద్దేశిస్తూ మాట్లాడాడు. ‘సీనియర్ల నుంచి అనుభవాలన్నీ జూనియర్లకు సహాయపడతాయి. భవిష్యత్తులో వారు చాలా అభివృద్ధిని చూస్తారు. ఎవరూ అన్ని నైపుణ్యాలతో పుట్టలేరు, మీరు నేర్చుకుంటారు.. మీరు కొత్త మార్గాలను కనుగొంటారు. మీరు మంచి స్థాయిలో ఉంటారు’ అని అనుకుంటున్నట్లు బుమ్రా తెలిపాడు. అయితే.. జట్టులో బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు మినహా భారత ఫాస్ట్ బౌలింగ్‌లో పెద్దగా అనుభవం లేదు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్ ఇంతకు ముందు ఆస్ట్రేలియా గడ్డపై టెస్టులు ఆడలేదు.

Show comments