Dimple Hayathi Responds On Issue With DCP Rahul Hegde: డీసీపీ రాహుల్ హెగ్డేతో నెలకొన్న పార్కింగ్ గొడవపై తాజాగా సినీ నటి డింపుల్ హయాతి స్పందించింది. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తానెప్పుడూ డీసీపీని ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేసింది. రోడ్‌లో ఉండాల్సిన పబ్లిక్ ప్రాపర్టీని తీసుకొచ్చి, ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టారని మండిపడింది. తన కారుతో డీసీపీ వాహనాన్ని తాను ఢీకొట్టలేదని, ఆయన కారు ఎక్కడైనా ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలిపింది. ఒకవేళ తన కారుతో ఢీ కొట్టి ఉండే.. రెండువైపులా డ్యామేజ్ ఉండాలి కదా? అంటూ లాజికల్ ప్రశ్న సంధించింది. గన్‌మెన్లను పెట్టుకొని ఉన్న అంతపెద్ద ఆఫీసర్‌ను తానేం చేస్తానని నిలదీసింది. కేసు కోర్టు వరకు వెళ్లాక.. తాను అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పుకొచ్చింది. అంతకుముందు ట్విటర్ మాధ్యమంగా కూడా.. అధికారాన్ని దుర్వినియోగం చేసినంత మాత్రాన, చేసిన తప్పు తుడిచిపెట్టుకుపోదని స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.
DCP Rahul Hegde: నేనెక్కడా తప్పు చేయలేదు.. డింపుల్ ప్రవర్తన అభ్యంతరకరం
మరోవైపు.. డీసీపీ రాహుల్ హెగ్డే వాదనలు మాత్రం మరోలా ఉన్నాయి. తన కారుకి అడ్డంగా డింపుల్ కారు పెట్టిందని, తాను వ్యక్తిగతంగా వెళ్లి మరీ కారు పక్కకు తీయాలని రిక్వెస్ట్ చేశానని అన్నారు. కానీ.. డింపుల్ తన పట్ల దురుసుగా ప్రవర్శించడంతో పాటు తన కారుని ఢీకొట్టిందని, కాళ్లతో కూడా తన్నిందని పేర్కొన్నారు. తన పట్ల డింపుల్ ప్రవర్తించిన తీరు అభ్యంతకరమైందని, ఈ ఘటనపై తన డ్రైవర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. తానెక్కడా తప్పు చేయలేదన్న ఆయన.. నిజాలు నిలకడ మీద బయటకు వస్తాయని తేల్చి చెప్పారు. అటు.. డింపుల్ లాయర్ పాల్ సత్యనారాయణ కూడా డీసీపీ రాహుల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డింపుల్‌ని వేధించాలన్న ఉద్దేశంతోనే డీసీపీ ఇలా వ్యవహరిస్తున్నారంటూ బాంబ్ పేల్చారు. డీసీపీ స్థాయి వ్యక్తికి ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదా? అంటూ నిలదీశారు. అసలు రోడ్ మీద ఉండాల్సిన బ్రిక్స్, కోన్స్‌ని.. ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎలా తీసుకొచ్చారంటూ ప్రశ్నించారు కూడా!
Dimple Hayati Row: డింపుల్‌పై తప్పుడు కేసు పెట్టారు.. డీసీపీ ఆమెతో రాష్‌గా మాట్లాడారు