హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాల దాటికి పెద్ద ఎత్తున ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడి పలుచోట్ల ఇళ్లు కూలిపోగా.. అందులో ఉన్నవారు శిథిలాల కింద సమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడే ఘటనలు చాలా చోటుచేసుకుంటుండగా తాజాగా.. కులులో ప్రమాదం జరిగింది. అక్కడ కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు కూలిపోయాయి. దీంతో కూలిపోయిన భవనాలు, ఇళ్ల శిథిలాల మధ్య పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కొండచరియల ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. పర్వతం పగుళ్లు రావడంతో లోయలోని ఇళ్లు ఎలా కూలిపోయాయో ఇందులో చూడవచ్చు. కొండచరియలు విరిగిపడిన దృశ్యాల్లో పలు అంతస్తుల భవనాలు కూలిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో నేటి నుంచి వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Muthireddy Yadagiri Reddy: దేవుడా మూడోసారి కూడా కేసీఆరే సీఎం కావాలి..
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా కులు-మండి హైవేపై నేడు వందలాది వాహనాలు నిలిచిపోయాయి. “కులు మరియు మండిని కలిపే రహదారి దెబ్బతింది. పండోహ్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గం కూడా దెబ్బతింది. దీంతో ప్రస్తుతం రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
Hair Care Tips:పెరుగుతో ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే చుండ్రు, జుట్టు రాలే సమస్యలు దూరం..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాట్లు, ఆకస్మిక వరదలు విస్తృతంగా విధ్వంసం సృష్టించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు రాష్ట్రం మొత్తాన్ని “ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతం”గా ప్రకటించింది. అంతేకాకుండా.. నష్టాన్ని అంచనా వేసి బాధిత ప్రజలను ఆదుకునేందుకు కృషి చేస్తోంది. ఈ వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా మొత్తం 709 రోడ్లు మూతపడ్డాయి. అంతేకాకుండా.. మొత్తం రూ. 8,014.61 కోట్ల ప్రజా మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లింది.
Salaar: అదిదా ప్రభాస్ క్రేజ్.. జవాన్ రికార్డులు రెండే రోజుల్లో చేరిపేశాడు!
రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. వర్షాల కారణంగా 2,022 ఇళ్లు పూర్తిగా, 9,615 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో 113 కొండచరియలు విరిగిపడడం వల్ల మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వర్షాల కారణంగా 224 మంది ప్రాణాలు కోల్పోగా, 117 మంది వర్షాలకు సంబంధించిన ప్రమాదాల్లో మరణించారని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది.
Disturbing visuals emerge from Anni, Kullu, depicting a massive commercial building collapsing amidst a devastating landslide.
It's noteworthy that the administration had identified the risk and successfully evacuated the building two days prior. pic.twitter.com/cGAf0pPtGd
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) August 24, 2023