BSA Gold Star 650: భారత మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650.. ధర ఎంతంటే..?
- భారత మార్కెట్లోకి బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650
- హైలాండ్ గ్రీన్.. ఇన్‌సిగ్నియా రెడ్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో బైకులు
- బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 ధర రూ. 3 లక్షలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రసిద్ధ బ్రిటిష్ బైక్ తయారీదారు బీఎస్ఏ (BSA) బైక్స్.. తన ప్రొడక్ట్ను 2021లో ప్రపంచవ్యాప్తంగా రీ మోడలింగ్ చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత మార్కెట్లోకి తిరిగి వచ్చింది. బీఎస్ఏ బైక్స్ తన మొదటి ఆఫర్ గోల్డ్ స్టార్ 650ని విడుదల చేసింది. హైలాండ్ గ్రీన్, ఇన్‌సిగ్నియా రెడ్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధర రూ. 3 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). మిడ్‌నైట్ బ్లాక్, డాన్ సిల్వర్ కలర్ ఆప్షన్‌ల ధర రూ. 3.12 లక్షలు. షాడో బ్లాక్ కలర్ ఆప్షన్ ధర రూ. 3.16 లక్షలు.. టాప్-ఆఫ్-ది-లైన్ లెగసీ ఎడిషన్ – షీన్ సిల్వర్ ధర రూ. 3.35 లక్షలుగా ఉంది.
USA: ల్యాండింగ్ సమయంలో షాకిచ్చిన పైలట్.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
Also Read
బుకింగ్ వివరాలు
బీఎస్ఏ బైక్స్ గోల్డ్ స్టార్ 650 కోసం బుకింగ్‌ను ఆగస్ట్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 2021 నుండి BSA గోల్డ్ స్టార్ 650 యూకే, యూరప్‌లో విక్రయిస్తున్నారు. ఇది భారతీయ తయారీదారు.. క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహీంద్రా గ్రూప్ యొక్క అనుబంధ సంస్థ. ఇది జావా.. యెజ్డీ బైక్లను కూడా తయారు చేస్తుంది.
రెట్రో డిజైన్
ఈ బైక్ గోల్డ్ స్టార్ డిజైన్ ని కలిగి ఉంది. ఇలాంటి డిజైన్ కలిగి ఉన్న బైక్ ను 1938-1963 మధ్య కాలంలోనే విక్రయించారు. మాడ్రన్ క్లాసిక్ డిజైన్‌లో గుండ్రని హెడ్‌ల్యాంప్, కర్వ్డ్ ఫెండర్‌లు.. మంచి ఆకారంలో ఆయిల్ ట్యాంక్ ఉన్నాయి. అంతేకాకుండా.. బైక్ క్రోమ్‌తో పాటు సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, సింగిల్-పీస్ సీటు.. వైర్-స్పోక్ వీల్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ బైక్ రెట్రో ఆకర్షణను మరింత పెంచుతాయి. బైక్‌లో డిజిటల్ రీడౌట్, USB ఛార్జింగ్‌తో కూడిన రెట్రో-శైలి ట్విన్-పాడ్ మీటర్ ఉంది.
ఇంజిన్ పవర్
బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650, 652 cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో శక్తిని పొందింది. ఈ బైక్ లో అతిపెద్ద డిస్ప్లేస్‌మెంట్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌లలో ఒకటి. ఈ ఇంజన్ 6,500 rpm వద్ద 45 bhp శక్తిని.. 4,000 rpm వద్ద 55 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కు 5-స్పీడ్ గేర్‌బాక్స్‌లు ఉంటాయి.
బ్రేకింగ్ మరియు సస్పెన్షన్
ఈ ఆధునిక క్లాసిక్ బైక్ క్రెడిల్ ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది. ఇందులో సస్పెన్షన్ డ్యూటీ కోసం ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు.. వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బ్రేకింగ్ కోసం ముందు.. వెనుక రెండింటిలోనూ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇది డ్యూయల్-ఛానల్ ABSతో 320 mm ముందు, 255 mm వెనుక డిస్క్ బ్రేక్ సెటప్‌ను కలిగి ఉంది.
భారతీయ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650తో పోటీపడుతుంది. కాగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ప్రారంభ ధర రూ. 3.03 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!