BY Vijayendra: కాంగ్రెస్ నేత కాళ్లను తాకిన యడియూరప్ప కుమారుడు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BY Vijayendra: కర్ణాటక రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర శుక్రవారం తుమకూరులోని ఓ ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయేంద్ర తన తండ్రికి కంచుకోట అయిన షికారిపుర నుంచి పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడి కాళ్లు తాకుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షికారిపుర నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు మూడు రోజుల ముందు విజయేంద్ర యెడియూరులోని సిద్ధలింగేశ్వర ఆలయానికి వచ్చారు. ఇదే సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కర్ణాటకలో ప్రముఖ షెడ్యూల్డ్ కులాల నేత అయిన పరమేశ్వర విజయేంద్ర అక్కడ ఉండటంతో ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
ఎన్నో ఊహాగానాలు, డ్రామాల తర్వాత బీజేపీ షికారిపుర నుంచి విజయేంద్రను బరిలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పలువురు పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేయగా, కేంద్ర నాయకత్వం అందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. యడ్యూరప్ప కూడా సిద్ధరామయ్యపై తన కుమారుడు పోటీ చేసే అవకాశాలను తోసిపుచ్చారు. 1983 నుంచి యడ్యూరప్ప ఏడుసార్లు విజయం సాధించడంతో షికారిపుర బీజేపీకి సేఫ్ సీటుగా భావిస్తున్నారు. అయితే టికెట్ ఆశించిన కొందరు స్థానిక నేతల నుంచి విజయేంద్రకు కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. ప్రస్తుత అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మరోసారి అధికారం నిలుపుకోవాలని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇక, కర్ణాకటలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న వెలువడనుంది. మే 10న పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మే 13న చేపట్టనున్నారు.
BJP's @BYVijayendra seeking blessings from senior congress leader @DrParameshwara at Yediyur Siddalingeshwara temple near Tumkur. Both the leaders were at Yediyur today. pic.twitter.com/U9MPEoYlJH
— Ashwini M Sripad/ಅಶ್ವಿನಿ ಎಂ ಶ್ರೀಪಾದ್🇮🇳 (@AshwiniMS_TNIE) April 14, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?