Airport issue in Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే నెల 10వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల నిబంధనల ప్రకారం రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తుంటారు. పొలిటికల్‌గా ఓటర్లను ప్రభావితం చేసే ఏ నిర్మాణాలు కూడా బయటికి కనిపించటానికి వీల్లేకుండా కవర్ చేస్తుంటారు.
read more: T-hub: టీ-హబ్.. సూపర్బ్. సాంకేతిక రంగంలో సాటిలేనిది
ఈ రూల్సే ఇప్పుడు శివమొగ్గ జిల్లా రిటర్నింగ్ అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఎందుకంటే.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సోగేన్ అనే ప్రాంతంలో ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. ఆ విమానాశ్రయం అధికార భారతీయ జనతా పార్టీ చిహ్నమైన కమలాన్ని పోలి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ ఎయిర్‌పోర్ట్‌ని పూర్తిగా కప్పేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు శివమొగ్గ జిల్లా రిటర్నింగ్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
దీంతో ఏం చేయాలో పాలుపోక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. లోటస్ ఆకారంలోని టెర్మినల్‌తో 775 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఎయిర్‌పోర్ట్‌ని ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభించారు. ఈ టెర్మినల్ నిర్మాణం కోసం 450 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. గంటకు 300 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ప్యాసింజర్ టెర్మినల్‌లి తీర్చిదిద్దారు.
మూడు పాయింట్ 2 కిలోమీటర్ల పొడవైన రన్‌వే కలిగిన ఈ ఎయిర్‌పోర్ట్‌లో ప్యాసింజర్ టెర్మినల్‌ని 4 వేల 320 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఏటీఆర్ 72 మొదలుకొని ఎయిర్‌బస్ 320 వరకు విమానాలు ఈ ఎయిర్‌లో ల్యాండింగ్, టేకాఫ్ అవుతుంటాయి. కర్ణాటకలోని రెండో అతిపెద్ద విమానాశ్రయంగా పేర్కొనే ఈ ఎయిర్‌పోర్ట్‌ని ఎలక్షన్
కోడ్ వంకతో మూసేస్తే వ్యాపారం ఏమైపోవాలి? అనేది పౌర విమానయాన శాఖ అధికారులు సైతం అర్థంకావట్లేదు.