వివాహేతర సంబంధాలు, అనుమానాలతో హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే అనుమానంతో ఓ వృద్ధున్ని దారుణంగా కాలు నరికి బైక్‌పై తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అంతే కాదు.. నరికిన కాలు చేతిలో పట్టుకొని బైక్‌పై వెళ్తున్న భయానక దృశ్యాలు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. భూమి తగాదా విషయంలో అన్నను తమ్ముళ్లు కత్తితో పొడిచి చంపారు. వల్లపు లింగయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు.
Murder : ములుగు జిల్లా వాజేడు మండలంలో దారుణ హత్య ఒక గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ (28) గుర్తు తెలియని దుండగుల చేతిలో బలైపోయాడు. ఆదివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘోర ఘటన గ్రామంలో తీవ్ర ఆందోళన కలిగించింది. విజయ్ తన ఇంటి సమీపంలో ఉన్న సమయంలో, గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై అకస్మాత్తుగా దాడికి…
పెద్దపెల్లి జిల్లాలో యువకుడి దారుణ హత్య జరిగింది. ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో దుండగులు సాయికుమార్ అనే యువకుడిని గొడ్డలితో నరికి చంపారు. ప్రేమ వ్యవహారమే కారణమని స్థానికులు అంటున్నారు. సాయికుమార్ జన్మదినం రోజే హత్య కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలో తన కూతురిని ప్రేమించాడనే కారణంతో సాయికుమార్ ను హత్య చేసినట్లు తెలుస్తోంది.
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో దారుణ హత్య జరిగింది. నూకలమర్రి గ్రామానికి చెందిన రషీద్ (35) అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కోనయ్యపల్లి రహదారిలో హోండా యాక్టివా షోరూం పక్కనే కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపారు. ఈ ఘటనలో హత్య తీరును పరిశీలించిన పోలీసుల ప్రకారం, రషీద్ తలతో పాటు మొత్తం 20 చోట్ల దాడి గాట్లు ఉన్నాయని సమాచారం. హత్య చాలా పాశవికంగా జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుడి మృతదేహాన్ని…
Bihar: ఖగారియాలో దారుణ హత్య కేసు వెలుగు చూసింది. ఈ హత్యలో నిందితుల క్రూరత్వం అని పరిధులను దాటేసింది. హంతకులు మహిళ కళ్లను ఛేదించారు. మహిళ నాలుక, ప్రైవేట్ భాగాలను కూడా కత్తితో కోశారు. మహిళను పస్రాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని దివంగత బబ్లూ సింగ్ భార్య 45 ఏళ్ల సులేఖా దేవిగా గుర్తించారు.