BRS Protest: గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.. హామీలు అమలు చేయలేదంటూ కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Protest: హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని దేవుడి ముందు కాంగ్రెస్ నేతలు అఫిడవిట్లు పెట్టారని, కానీ.. 100 రోజులు అని చెప్పి ఇప్పుడు 1000 రోజులు గడిచినా హామీలను అమలు చేయలేదని విమర్శించారు.
Also Read
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
1000 రోజుల పాలనలో హామీలను ఎందుకు అమలు చేయలేదో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ సూచించారని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నిస్తామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల పరిస్థితి ఏమిటో కూడా అసెంబ్లీలో అడుగుతామని చెప్పారు.
రైతులకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అర్థమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని మహిళలు, యువత, విద్యార్థుల తరఫున బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రశ్నిస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కనీసం నెల రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజులు మాత్రమే సభ నిర్వహించి తూతూమంత్రంగా ముగిస్తే తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తాను ఇలాంటి విమర్శలు ఎన్నో చూశానని, అయితే ప్రజల తరఫున అసెంబ్లీలో బలంగా పోరాడాలని కేసీఆర్ తమకు సూచించారని తెలిపారు.
22Aపై అసెంబ్లీలో చర్చించాలి: ఎమ్మెల్యే సంజయ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ.. 22ఏ నిబంధన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 22A ఎందుకు అమలు చేయాల్సి వచ్చిందో అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదో ప్రభుత్వం ప్రజలకు, అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని కోరారు.
ప్రభుత్వ భూములను ఎందుకు విక్రయిస్తున్నారో ప్రజలకు వివరించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకే ప్రజలు తమను అసెంబ్లీకి పంపించారని, అయితే అసెంబ్లీలో తమ మైకులు కట్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అజెండా కోసమే అసెంబ్లీని నడుపుతున్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మార్షల్స్‌ను ఏర్పాటు చేసి తమను అడ్డుకుంటున్నారని సంజయ్ ఆరోపించారు. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు ఈసారి కనీసం నెల రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!