Jagadish Reddy: ప్రజలు అడిగేది పథకాలు.. పత్రాలు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ ప్రజాపాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేక ప్రజాపాలన పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎలాంటి అప్లికేషన్లు లేకుండానే తాము లబ్ధిదారులను ఎంపిక చేశామని… ఇప్పుడు దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రజలు అడిగేది పథకాలు.. పత్రాలు కాదని జగదీష్ రెడ్డి అన్నారు. దరఖాస్తులు లేకుండా… దళారి వ్యవస్థ లేకుండా తాము ఆన్ లైన్ విధానం ద్వారా అర్హులను ఎంపిక చేశామన్నారు. ఆరు గ్యారంటీల దరఖాస్తు ఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ఈ పత్రాల డ్రామాలు ఎంతోకాలం సాగవన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మోసాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారని.. హామీలు అమలు చేయకుంటే అదే ప్రజలు మీ వెంటపడి తరుముతారని జగదీష్ రెడ్డి హెచ్చరించారు.
Read Also: TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరిన్ని కొత్త బస్సులు..!
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
కాంగ్రెస్ హయాంలో ఉద్యమకారుల FIR రికార్డులు లేకుండా చేసి ఇవాళ వివరాలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే నల్లగొండ జిల్లాకు తాము చేసిన దాంట్లో పది శాతం చేయాలని మాజీ మంత్రి సవాల్ విసిరారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని అన్నారు. 9న రుణ మాఫీ, 4న రైతు బంధు అని కోతలు కోశారు.. అమలు ఎక్కడ అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Vijay: షాకింగ్.. విజయ్ పైకి చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్‌లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?