Site icon NTV Telugu

Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్‌ బలంగానే ఉంది

Jaggareddy

Jaggareddy

Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు BRS లో నెలకొన్న కుటుంబ తగాదాలు కొత్త దిశగా మలుపుతీస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన చర్చనీయాంశంగా మారాయి. జగ్గారెడ్డి వ్యాఖ్యానిస్తూ, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ముందంజలో ఉందని, BRS రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. అయితే, BRS లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కుటుంబ అంతర్గత విభేదాలు పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని తెచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల విడుదల చేసిన లేఖపై స్పందిస్తూ, ఆ లేఖ పార్టీ క్యాడర్‌ను తడబాటు పరిచే అవకాశం ఉందని, ఆ క్యాడర్ బీజేపీ వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని జగ్గారెడ్డి హెచ్చరించారు. “ఎవరికి వాళ్లు, నేను ఏదో అనకూడదన్న భావన మంచిది కాదు” అని అన్నారు.

స్టాక్ మార్కెట్లో అత్యంత ఖరీదైన షేర్లు కలిగిన టాప్- 10 దేశాలు..

“ఎవరూ ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా – కేసీఆర్ అంటే కేసీఆర్. ఆయన లేకుండా BRS లేదు. కేటీఆర్, హరీష్ రావు, కవితల వల్ల పార్టీ నడవదు. కవిత స్వతహాగా లీడర్ కాదు” అని జగ్గారెడ్డి మండిపడ్డారు. కవిత తన లేఖతో “ఆ చెట్టును నరికేస్తున్నారు – అదే చెట్టు నీడలోనే తాము జీవిస్తున్నారని గుర్తించుకోవాలి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖ వల్ల బీజేపీకి బలం చేకూరే అవకాశముందని, ఆమె బహిరంగంగా పార్టీలో విభేదాలు వెలుగులోకి తేవడం ద్వారా ప్రత్యర్థులే లాభపడతారని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. “కవిత రాజకీయ ఆత్మహత్య చేసుకుంటున్నారు. డిప్రెషన్‌లో ఉండి తొందరపడి లేఖ విడుదల చేశారు. ఇలా బీజేపీని పెంచి పోషించే పరిస్థితి సృష్టించకూడదు” అని స్పష్టం చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు అలెర్ట్ కావాల్సిన సమయం వచ్చిందని జగ్గారెడ్డి హెచ్చరించారు. “లేఖలు, లీకులు మీడియా లైవ్‌ల్లో కనిపిస్తాయి కానీ… అసలు ప్రభావం లోతుగా ఉంటుంది. BRS తన రాజకీయ ఆత్మహత్య చేసుకుంటూ, బీజేపీని బలోపేతం చేస్తున్నదనే విషయం కాంగ్రెస్ మర్చిపోవద్దు” అని అన్నారు.

Sardar 2 : కార్తీ బర్త్ డే స్పెషల్.. ‘స‌ర్ధార్ 2’ నుండి పవర్ ఫల్ పోస్టర్ రిలీజ్

Exit mobile version