Site icon NTV Telugu

Nandakishore Vyas: బీఆర్ఎస్కు మరో షాక్.. పార్టీకి గోషామహల్ ఇంఛార్జి రాజీనామా

Nanda Kishore

Nanda Kishore

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ గోషామహల్ ఇంఛార్జి నందకిషోర్ వ్యాస్ రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, తెలంగాణ భవన్ కి ప్యాక్స్ లో పంపించారు. తాను ఇక నుంచి పార్టీలో పని చేయలేనని.. పార్టీలోని తన పోస్టుకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Harish Rao: కవిత అరెస్ట్ అక్రమం.. ఇది బీజేపీ, కాంగ్రెస్ కుట్ర

కాగా.. శనివారం గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నందకిషోర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేస్తున్న కృషికి ఆకర్షితుడినై తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన నందకిషోర్.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఓడిపోయారు.

CAA: అమెరికా జోక్యంపై భారత్ ఏం రిప్లై ఇచ్చిందంటే..!

Exit mobile version