గత ఎన్నికల్లో గోశామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక నార్త్ ఇండియన్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తమ అధినేత కేసీఆర్ నిర్ణయించారని... ఆ నిర్ణయం మేరకే నంద కిషోర్ వ్యాస్ ( బిలాల్ ) కు టికెట్ కేటాయించారని గోశామహల్ బీఆర్ఎస్ నాయకుడు ఎమ్.ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రచారంలో కూడా కేటీఆర్ రెండు సార్లు నియోజకవర్గంలో ప్రచారం చేశరని గుర్తు చేశారు. అయితే నందు బిలాల్ అసమర్థత వల్ల గెలిచే సీటు ఓడిపోవాల్సి వచ్చిందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ గోషామహల్ ఇంఛార్జి నందకిషోర్ వ్యాస్ రాజీనామా చేశారు. త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, తెలంగాణ భవన్ కి ప్యాక్స్ లో పంపించారు. తాను ఇక నుంచి పార్టీలో పని చేయలేనని.. పార్టీలోని తన పోస్టుకి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.