పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ “బ్రో ది అవతార్” ఈ చిత్రాన్ని విలక్షణ నటుడు మరియు దర్శకుడు అయిన సముద్రఖని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు.అలాగే ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు.ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వినోదయ సీతం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.ఇక ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే సంగీతం అందించారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హాట్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. అలాగే మరో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమా జూలై 28 న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా కు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది అయినా కూడా కలెక్షన్స్ లో బ్రో మూవీ అదరగొట్టింది.
ఇది రీమేక్ సినిమా అయినప్పయికీ కూడా దాదాపు 70 కోట్ల కి పైగా షేర్ ని రాబట్టేసింది.దీనితో బ్రో సినిమా టాక్ బాగోలేక పోయినా మంచి వసూళ్లు సాధించింది.ఇక ఈ చిత్రం థియేటర్ రన్ కూడా కంప్లీట్ చేసేసుకుని ఓటీటీ విడుదలకు సిద్ధం అయింది తాజాగా ఈ చిత్రం ఓటిటి విడుదల పై బిగ్ అప్డేట్ వచ్చింది. కాగా ఈ చిత్రం ఓటిటి హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. కాగా ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ ఆగస్ట్ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.దీనితో బ్రో సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇదొక పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు.