Bridegroom Passes Away : రేపు పెళ్లి.. ఇవాళ వరుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ జిల్లాలో పెళ్లి ఇంటా విషాదం చోటు చేసుకుంది. రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన పెళ్ళికొడుకు కరెంట్ షాక్ తో మృతి చెందాడు. దీంతో పెళ్లి ఇంటా విషాదం అలముకుంది. రేపు పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. పెళ్ళిసందడిగా ఉండాల్సిన ఇళ్ళు శోకసంద్రంగా మారింది. మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంతండాలో పెళ్ళికొడుకు భూక్య యాకూబ్ కరెంట్ షాక్ తో మృతి చెందాడు. భూక్య బాలాజీ కాంతి దంపతుల ఏకైక కుమారుడు యాకుబ్ కు గార్ల మండలం పిక్లీతండాకు చెందిన అమ్మాయితో శుక్రవారం అర్ధరాత్రి వివాహం జరగాల్సి ఉంది. పెళ్ళి ఏర్పాట్లలో నిమగ్నమైన యాకుబ్, ఇంట్లో నీళ్ళ కోసం బోరు మోటార్ ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్ గురై ప్రాణాలు కోల్పోయారు.
Also Read : Italy: మిలన్ నగరంలో భారీ పేలుడు.. అగ్నికి ఆహుతైన కార్లు..
Also Read
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
- Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
- Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
మరికొద్ది గంటల్లో పెళ్ళి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కడంతో పెళ్ళింటా విషాదం అలముకుంది. పెళ్ళికొడుకు మృతితో కన్నవారుతోపాటు బంధుమిత్రులు బోరున విలపించారు. ఎదిగిన కొడుకు ఓ ఇంటివాడు అవుతున్న తరుణంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోవడంతో కన్నవారు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతి చెందిన పెళ్ళికొడుకు యాకుబ్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్ళి పనుల్లో భాగంగా ఇంట్లో నీళ్ల కోసం బోరు మోటారు ఆన్ చేస్తుండగా షాక్ గురై ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులంతా షాక్ గురయ్యారు. 12న అర్థరాత్రి పెళ్ళి, 13న ఆదివారం యాకుబ్ ఇంటి వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేయగా కరెంట్ షాక్ విషాదాంతంగా మార్చిందని బందువులు కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్ళికొడుకు అక్క పెళ్ళీడు కొచ్చాక మృతి చెందగా పెళ్లి సమయంలోనే యాకుబ్ ప్రాణాలు కోల్పోవడంతో బంధువులు తలుచుకుంటూ విలపించారు. యాకుబ్ కు ఒక చెల్లెలు ఉందని తెలిపారు. విధి వక్రీకరించడంతో బాజాలు మ్రోగాల్సిన ఇంట చావు డప్పు మ్రోగడంతో చూపరుల హృదయాలను ద్రవింపజేసింది.
Also Read : Priyanka Singh: నన్ను కామంతో చూడకండి .. బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ అటెంప్ట్
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!