Italy: ఇటలీ వాణిజ్య రాజధాని మిలన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. పలు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఉత్తర ఇటలీలోని మిలన్ నగరంలోని గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తెలిపారు.
Read Also: Delhi: 4 ఏళ్ల బాలికపై ప్యూన్ అఘాయిత్యం..
మిలన్ నగరంలోని పోర్టా రోమానా ప్రాంతంలో ఆక్సిజన్ గ్యాస్ డబ్బాలను రవాణా చేస్తున్న వాహనంలో ముందుగా పేలుళ్లు జరిగినట్లు అనుమానిస్తున్నారు. దీంతో సమీపంలో ఉన్న కార్లకు మంటలు వ్యాపించాయి. పేలుళ్ల వల్ల స్థానికం ఉన్న స్కూళ్లు, భవనాలను ఖాళీ చేయించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. పేలుడు కారణంగా సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. సమీపంలోని భవనాలకు కూడా అది వ్యాపించింది.