కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల్లో పెళ్లి అనగా కాబోయే భర్త ఇంటిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలో సోమవారం జరిగింది. అయితే కాబోయే అత్తింటివారే తమ కూతురిని చంపారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెపట్టారు. వివరాలు.. కర్ణాటకలోని విజయనగరం జిల్లాకు చెందిన ఐశ్యర్య, అశోక్ కుమార్‌లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మంచి ఉద్యోగంలో సెటిలైన ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని ఇంట్లో చెప్పారు.…