Madhya Pradesh: మరికొద్ది క్షణాల్లో తాళి కడితే పెళ్లయిపోతుంది.. సరిగ్గా అదే సమయానికి వరుడు నల్లగా ఉన్నాడని పెళ్లి వద్దంటూ మొండికేసింది వధువు.. పెద్దలు ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో ఏం చేయాలో తెలియక పెళ్లిని రద్దు చేసిన ఘటన ఇటీవల బీహార్లో జరిగింది. మళ్లీ ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాకపోతే కొంచెం డిఫరెంట్. మధ్యప్రదేశ్‌లో పెళ్లికి కొన్ని గంటల ముందు ఓ వధువు బ్యూటీ పార్లర్‌కు వెళ్లి తిరిగి రాలేదు. గంటలు గడుస్తున్నా రాకపోవడంతో బంధువులు తీసుకెళ్లేందుకు వెళ్లారు. అక్కడ వారికి వధువు కనిపించకపోవడంతో.. షాకింగ్ తిన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్థాన్‌లోని ఓ పెద్ద ప్రాంతానికి చెందిన శిల్పి అనే యువతికి మధ్యప్రదేశ్‌లోని కొత్వాలి పరిధి మోరీనా ప్రాంతానికి చెందిన యోగేష్ వర్మ అనే యువకుడితో వివాహం నిశ్చయించారు.
Read Also:SatyaPrem Ki Katha: వాహ్… మీ ఇద్దరి కెమిస్ట్రీ మ్యాజిక్ చేసింది డార్లింగ్స్
మే 29న యోగేష్, శిల్పి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు.. పెళ్లి జరగాల్సిన మే 29న ఇరు కుటుంబాలు పెళ్లి మండపానికి చేరుకున్నాయి. మండపమంతా బంధు మిత్రులతో నిండిపోయింది. వరుడు కూడా తన వివాహ దుస్తులలో రెడీగా ఉన్నాడు. వివాహ తంతు ప్రారంభమైంది. వధువును తీసుకురావాలని చెప్పారు. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు శిల్పి బ్యూటీ పార్లర్‌కి వెళ్లింది. శిల్పి పెళ్లికి మేకప్ వేసుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. వస్తుందని ఓపికగా కాసేపు ఎదురు చూశారు. కానీ నిమిషాలు గంటలుగా మారాయి కానీ శిల్పి ఎక్కడా కనిపించలేదు.
Read Also:TSPSC: 80 మందికి ఏఈ పేపర్ అమ్మిన డీఈ రమేష్.. విచారణలో షాకింగ్ విషయాలు..!
వధువు బంధువులు బ్యూటీపార్లర్‌కు వెళ్లారు. కానీ వధువు లేదు. ఆమె రాలేదని అక్కడివారు చెప్పారు. షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. వరుడు, అతని కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన వారంతా ఒక్కసారిగా వధువు అదృశ్యమైందని తెలిసి.. ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసి పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వెళ్లిపోయారు. దీన్ని అవమానంగా భావించిన వరుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అంతేకాదు 150 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా యువతి ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అయితే ఆమె ఎక్కడికి వెళ్లింది అనేది మిస్టరీగా మారింది.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి పందిరిలో కనిపించాల్సిన వధువు కనిపించకుండా పోవడంతో ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది.