Brahmastra 2 : ‘బ్రహ్మాస్త్ర 2’ ను నిర్మిస్తామంటూ ముందుకొచ్చిన డిస్నీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brahmastra 2 : రణబీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’ . ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. విడుదలకు ముందే రెండు భాగాలుగా తీసుకొస్తున్నమంటూ చిత్ర బృందం ప్రకటించింది. అస్త్రావెర్స్ నేపథ్యంలో ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో కనిపించారు. ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివగా సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
Read Also: Prabhas, Maruthi Movie : ట్రెండ్ మార్చిన ప్రభాస్.. కామెడీ చేస్తున్న రెబల్ స్టార్
Also Read
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
కాగా, బ్రహ్మస్త్ర పార్ట్ 2ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఆల్రెడీ కథా కథనాలు సిద్ధంగానే ఉన్నాయి కాబట్టి.. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా డిస్నీ సంస్థకు బాగా నచ్చిందంట. దర్శకుడు అయాన్ తెరకెక్కించిన విధానం ఆకట్టుకోవడంతో బ్రహ్మాస్త్ర-2 కి బడ్జెట్ కేటాయించడానికి ఆ సంస్థ ముందుకొచ్చినట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని ఓ ఫ్రాంచైజీగా చేస్తే బాగుంటుందని ఆ సంస్థ భావిస్తోంది. ఇందుకోసం చిత్ర నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ తో పనిచేసేందుకు సిద్ధంగా ఉందంటూ కరణ్ జోహార్ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సమాచారం.
అయితే సీక్వెల్లో లీడ్ క్యారెక్టర్లో ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు బీ-టౌన్లో హాట్ టాపిక్. ఈ రోల్లో ఓ టాప్ స్టార్‌ను ఎంపిక చేయాలని చూస్తున్నారట. రణవీర్ సింగ్, హృతిక్ రోషన్ లాంటి హీరోల పేర్లు వినిపిస్తున్నా… ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. సీక్వెల్‌ను దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. బ్రహ్మాస్త్ర పార్ట్ 2ను 2025 డిసెంబర్ కల్లా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also: Kantara: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా ‘కాంతారా’.. అలా అనొద్దంటున్న దర్శకుడు
మరి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబర్ 4వ తేదీ నుంచి ‘బ్రహ్మాస్త్ర’ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..