Boycott Turkey : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్న టర్కీకి భారత వ్యాపార వర్గాలు గట్టి ప్రతిస్పందన ఇస్తున్నాయి. ఇప్పటికే పుణేలోని వ్యాపారులు టర్కీ యాపిల్ దిగుమతులను నిలిపివేసిన వేళ… రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మార్బుల్ వ్యాపారులు మరో ఘాటైన నిర్ణయం తీసుకున్నారు. టర్కీ నుంచి మార్బుల్ దిగుమతులను పూర్తిగా ఆపాలని నిర్ణయించి, దేశీయ పరిశ్రమకు మద్దతుగా నిలిచారు.
OTT : ఓటీటీలో రికార్డులు బద్దలు కొట్టిన ‘అయ్యనా మానే’
ఆసియాలోనే అతిపెద్ద మార్బుల్ ఎగుమతి కేంద్రంగా పేరొందిన ఉదయ్‌పూర్‌లో “మార్బుల్ ప్రాసెసర్స్ కమిటీ” ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కమిటీ అధ్యక్షుడు కపిల్ సురానా మాట్లాడుతూ, “టర్కీ పాక్‌కు మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ, టర్కీతో వాణిజ్య సంబంధాలను తెంచుకోవాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది,” అని తెలిపారు. ప్రస్తుతం దేశానికి దిగుమతయ్యే మార్బుల్‌లో 70 శాతం టర్కీ నుంచే వస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మార్బుల్ వ్యాపారులకు మార్గదర్శకంగా నిలవాలని, టర్కీపై వాణిజ్యంగా ఒత్తిడి తెచ్చేలా అన్ని రాష్ట్రాల్లోని మార్బుల్ సంఘాలు ఇదే బాటలో నడవాలని ఆయన పిలుపునిచ్చారు. “ఇది కేవలం వ్యాపార నిర్ణయం కాదు… దేశ భద్రత పట్ల, ప్రభుత్వం పట్ల మేము కట్టుబాటుగా ఉన్నామన్న సంకేతం,” అని సురానా స్పష్టం చేశారు.
వాణిజ్యం నిలిపివేతతో దేశీయ మార్బుల్ పరిశ్రమకు గణనీయమైన లాభాలు చేకూరతాయని, డిమాండ్ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ‘బాయ్‌కాట్ టర్కీ’ పిలుపు ఇతర రంగాలకు విస్తరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇక పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పాక్ ప్రధాని షరీఫ్‌తో భేటీ కావడం, టర్కీ డ్రోన్లు పాక్‌కు సాయం చేసినట్టు పలు సమాచారం వెలుగులోకి రావడం, భారత్ కూల్చిన డ్రోన్లలో టర్కీ తయారీ ‘అసిస్ గార్డ్ సోంగర్’ భాగాలు కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో టర్కీపై వ్యాపార బహిష్కారం దేశప్రజల భావోద్వేగానికి ప్రతినిధిగా మారుతోంది.
AP Govt: మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్.. ఏపీ ప్రభుత్వం కసరత్తు!