Viral: వాష్‌రూమ్‌లో ఇన్‌స్టాల్ చేసిన హ్యాండ్ డ్రైయర్‌తో మీ చేతులను ఆరబెట్టుకుని ఉండే ఉంటారు. కానీ, హ్యాండ్ డ్రైయర్‌తో హెయిర్ సెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయాడు ఓ వ్యక్తి. అవును, ఈ వీడియోలో, వాష్‌రూమ్‌లో హ్యాండ్ డ్రైయర్ కింద కూర్చుని దువ్వెన సహాయంతో తన జుట్టును ఎలా సెట్ చేస్తున్నాడో చూడవచ్చు. హ్యాండ్ డ్రైయర్‌ను హెయిర్ డ్రైయర్‌గా ఉపయోగించే అతని ట్రిక్ చూసి ప్రజలు అవాక్కయిపోతున్నారు. మాకు ఇలాంటి ఐడియాలు రావట్లేదు అంటూ బాధపడుతున్నారు. దీన్నే అవసరాన్ని బట్టి వస్తువులను ఉపయోగించడం అంటారు. మీరూ.. ఎప్పుడైనా ఇలాంటి పని చేశారా ?
Read Also: Shocking News : చనిపోయి ఆరేళ్లవుతోంది.. రెండేళ్ల కొడుకుతో ప్రత్యక్షం
ఈ వీడియోను ఫిబ్రవరి 2న IPS అధికారి ఆరిఫ్ షేక్ (@arifhs1) ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కాసేపటికే దానికి వేలల్లో వ్యూస్, వందల్లో లైక్స్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఒక వ్యక్తి .. మనం భారతీయులం. ఇలాంటివి కనుగొనడంతో ముందంజలో ఉన్నామంటూ రాసుకొచ్చాడు. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో రాయండి.
Necessity is mother of invention… pic.twitter.com/iJ8J5MxG9x
— Arif Shaikh IPS (@arifhs1) February 2, 2023