Boy Stuck in Lift : లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. కాపాడిన హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు
- హైదరాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్ లో చిక్కుకున్న నాలుగేళ్ళ బాలుడు
- సంఘటన స్థలానికి చేరుకున్న DRF బృందాలు పోలీసులు
- బాలున్ని సురక్షితంగా కాపాడిన హైడ్రా DRF బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boy Stuck in Lift : లిఫ్టుకు – స్లాబ్‌కు మధ్య ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడిని హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు శుక్రవారం కాపాడాయి. మాసబ్ ట్యాంకు, శాంతినగర్‌లోని మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంటులో లిఫ్ట్ డోర్ కు గోడకు మధ్య 6 సంవత్సరాల అర్నవ్ ఇరుక్కున్నాడు అని హైడ్రాకు ఫిర్యాదు రాగానే డీఆర్ ఎఫ్ రంగంలోకి దిగింది. మధ్యాహ్నం 2.29 గంటలకు ఘటన జరిగినట్టు సమాచారం అందుకోగానే డీఆర్ ఎఫ్ మొదటి బృందం 10నిమిషాల్లో చేరుకుంది. తర్వాత మరో రెండు బృందాలు తోడయ్యాయి. గ్రిల్‌తో ఉన్న లిఫ్ట్ డోర్ తెరిచిన వెంటనే బయటకు వచ్చే క్రమంలో అంతస్తు స్లాబ్‌కు – లిఫ్ట్‌కు మధ్య ఉన్న గ్యాప్(ఖాళీగా ఉన్న సందులో)లో పడిపోయి కిందకు జారి మొదటి అంతస్తు దగ్గర ఇరుక్కున్నట్టు నివాసితులు చెప్పారు. నాలుగు అంతస్తుల అపార్టుమెంట్లో మూడో అంతస్తులో పిల్లలతో ఆడుకుని లిఫ్టు ఎక్కి జారిపడినట్టు నివాసితులు తెలిపారు. లిఫ్ట్ ఎవరూ ఆపరేట్‌చేయకుండా ముందుగా కరెంటు కనెక్షన్ తొలగించారు. ఆ వెంటనే డీఆర్ ఎఫ్ బృందాలు ఆపరేషన్ మొదలు పెట్టాయి.
Manipur: రాష్ట్రపతి పాలన మొదటి వారంలోనే.. మణిపూర్‌లో ఉగ్రవాదులపై భారీ దాడులు..
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
గ్యాస్‌కట్టర్లు, ఫైర్ విభాగానికి చెందిన పనిముట్లుతో లిఫ్టు ఫ్రేమ్‌ను కట్ చేయడంతో పాటు.. స్లాబ్‌ను కూడా అతి కష్టమ్మీద కట్ చేసి బాలుడుని హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు కాపాడాయి. సరిగ్గా 4.35 గంటల ప్రాంతంలో బయటకు తీసి.. తల్లిదండ్రులకు అప్పగించి.. తర్వాత ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎ. యజ్ఞ్ననారాయణ, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి. దత్తు ఆధ్వర్యంలో డీఆర్ ఎఫ్ బృందాలు ఈ ఆపరేషన్‌ను పూర్తి చేశాయి. లిఫ్టు ఫ్రేమ్‌లు కట్ట చేసి క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను పూర్తి చేసి…. పిల్లాడిని సురక్షితంగా బయటకు తీయడాన్నిచూసిన స్థానికులు హైడ్రా బృందాలను అభినందించారు.
Madhu Yaskhi Goud : అవినీతి అధికారుల లిస్ట్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!