ఈ సృష్టి ఎంతో విచిత్రమయినది. శివుడి మెడలో ఉండే నాగుపాము.. ఆ పరమేశ్వరుడి కల్యాణం రోజు ఆయన్ని చూడాలనిపించిందో ఏమో.. ఆలయానికి వచ్చింది. ఒక వైపు స్వామివారి కల్యాణం.. మరోవైపు గుడిలోకి వచ్చిన నాగుపాము దర్శనంతో ఆ ఆలయంలో సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గొడిసేర్యాల్ శివాలయంలో మహాద్భుతం చోటుచేసుకుంది,మహాశివరాత్రి పర్వదినాన శివ పార్వతుల కళ్యాణం జరుగుతుండగా ఆలయ గర్భగుడిలో నాగుపాము దర్శనమిచ్చింది,నాగేంద్రున్ని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్ల ద్వారా బారులు తీరారు.
Read Also: BCCI : ఆస్ట్రేలియాతో వన్డేలకు టీం ఇండియా జట్టు ప్రకటన
నిర్మల్ జిల్లా దస్తూరబాద్ మండలంలోని గొడిసేర్యాల్ శివాలయంలో మహాశివరాత్రి పర్వదినం రోజు రాత్రి 11 గంటల సమయంలో నాగుపాము ప్రత్యేక్షమైంది, దీంతో నాగేంద్రున్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు,ఏట ఈ ఆలయంలో శివరాత్రి రోజు నాగుపాము దర్శనం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకం. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్,నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుండి భక్తులు భారీ సంఖ్యలో ఈ ఆలయానికి తరలివచ్చి ఆలయంలో శివ భక్తులు జాగారాలు ఉంటూ నాగేంద్రున్ని దర్శించుకుంటారు మహాశివరాత్రి పర్వదినం రోజున శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఇలా నాగుపాము రావడం, ఆ నాగేంద్రుడిని దర్శించుకోవడం తమకెంతో శుభదాయకం అంటున్నారు భక్తులు.
Read Also: Satyavati Rathod : వైఎస్ షర్మిలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్