Rohit Sharma Captaincy: రోహిత్ కెప్టెన్సీ అస్సలు బాలేదు.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ ఫైర్!
- రోహిత్ కెప్టెన్సీపై రవిశాస్త్రి ఫైర్
- ఇద్దరు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారు
- భారత ఫీల్డర్లు చురుగ్గా లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోహిత్ శర్మ కెప్టెన్సీపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఫైర్ అయ్యారు. సారథిగా రోహిత్ తీసుకుంటున్న నిర్ణయాలు సరిగ్గా లేవని, బౌలర్లను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని, 40 ఓవర్ల తర్వాత బౌలింగ్‌కు తీసుకురావడం అవసరమా? అని ప్రశ్నించారు. ఫీల్డింగ్ సెటప్ కూడా సరిగ్గా లేదని రవిశాస్త్రి మండిపడ్డారు. మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ (140) సెంచరీ చేయగా.. మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్ హాఫ్ సెంచరీలు బాదారు.
మొదటి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ మూడు పరుగులకే ఔట్ అయ్యాడు. బ్యాటర్‌గా విఫలమవుతూ వస్తోన్న రోహిత్.. కెప్టెన్‌గానూ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న రవిశాస్త్రి.. రోహిత్ కెప్టెన్సీ అస్సలు బాలేదని పేర్కొన్నారు. ‘ఎందుకు తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నారు. 40 ఓవర్ల తర్వాత వారిని బౌలింగ్‌కు తీసుకురావడం అవసరమా?. మెల్బోర్న్లో స్పిన్నర్లు, పేసర్లు ఒక్కో ఓవర్ వేయాలి. జడేజా, సుందర్‌కు రోహిత్ ఆలస్యంగా బౌలింగ్ ఎందుకు ఇచ్చాడో అర్థం కావడం లేదు’ అని అన్నారు.
Also Read
Also Read: Steven Smith Century: టీమిండియా అంటేనే ఊపొస్తుంది.. స్టీవ్ స్మిత్ ప్రపంచ రికార్డు!
‘ఈరోజు భారత బౌలింగ్‌ను జస్ప్రీత్ బుమ్రాతో ప్రారంభిస్తే బాగుండు. రోహిత్ బంతిని బుమ్రాకే కాకుండా మహమ్మద్ సిరాజ్ చేతికి ఇచ్చాడు. మూడో ఓవర్లో బుమ్రాను బౌలింగ్‌కు తీసుకొచ్చాడు. సిరాజ్ ఆత్మవిశ్వాసంతో లేడు. ఇలాంటి సందర్భంలో అతడిని సరిగ్గా హ్యాండిల్ చేయాలి. మిచెల్ స్టార్క్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడూ ఫీల్డింగ్ సెటప్ సరిగ్గా లేదు. భారత ఫీల్డర్లు చురుగ్గా లేరు’ అని రవిశాస్త్రి ఫైర్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా 23 ఓవర్లు వేసి 3 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ 15 ఓవర్లు వేసి.. ఒక వికెట్ తీశాడు.
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?