ఈరోజుల్లో జనాలకు ఆరోగ్యం పై శ్రద్ద పెరిగింది.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా అతి చిన్న వయస్సులోనే షుగర్, బీపి వంటి వ్యాధులు వస్తుంటాయి.. అందులో ఒక్కసారి మధుమేహం వస్తే మళ్లీ తగ్గడం కష్టం.. జీవితాంతం ఆ వ్యాధి వదలదు.. కంట్రోల్ చేసుకోవాలి.. అయితే ఈ వ్యాధికి ఉసిరి తో చెక్ పెట్టొచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఉసిరిని ఎలా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
రోజు ఉసిరి రసాన్ని తాగడం వల్ల అనేకరకాల సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఉసిరి రసంలో చక్కర కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఉదయం, సాయంత్రం తాగడం వల్ల మీబ్లడ్‌లోని షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.. అలాగే గ్రీన్ క్యాబేజీ, సెలెరీ, బచ్చలికూర, బీట్‌రూట్, వెల్లుల్లి, టమోటా, అల్లం, గ్రీన్ యాపిల్, దోసకాయ, మరియు నిమ్మకాయను కూడా తీసుకొని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..
అదేవిధంగా.. పాపాయ, కీరా, దోసకాయ లను కలిపి జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. ఎండవల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరంలో పేరుకు పోయిన కొవ్వంతా కరిగిపోయి వెయిట్ లాస్ అవుతారు.. అలాగే బొప్పాయిలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మరియు కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది.. షుగర్ పేషంట్స్ కు చాలా మంచిది.. రోజు డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.