విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఝాన్సీ పోటీ విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం అని అన్నారు. తనకు ఎటువంటి సమాచారం లేదు.. అధిష్టానం ఆలోచనల ఆధారంగా నిర్ణయం ఉంటుందని మంత్రి బొత్స తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఆందోళన చేస్తున్న కార్మికా సంఘాలకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం ఎందరో పోరాటం చేశారు అని వ్యాఖ్యనించారు. నేను స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణ కోసం న్యాయం పోరాటం చేస్తున్నాను..