వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్టీల్ ఫ్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రధాని చెప్తే.. తాను, అమర్‌నాథ్ పోటీ నుంచి తప్పుకుంటామని అన్నారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్‌లో పోరాటం చేశానన్నారు.
బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై స్పందించి, పరిష్కరించానని సగర్వంగా చెప్పగలనని విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఒకప్పుడు రైల్వే గేట్లు సరిగ్గా ఉండేవి కాదని.. ఆ అంశాలన్నీ పార్లమెంట్‌లో ప్రస్తావించి పనులు చేయించానన్నారు.
విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఝాన్సీ పోటీ విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం అని అన్నారు. తనకు ఎటువంటి సమాచారం లేదు.. అధిష్టానం ఆలోచనల ఆధారంగా నిర్ణయం ఉంటుందని మంత్రి బొత్స తెలిపారు.