Local Body Election: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి నామినేషన్ దాఖలైంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ ఫైల్ చేశారు. ఆయన వెంట బొత్స ఝాన్సీ, ఎంపీ తనుజారాణి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పెట్టడం అంటే టీడీపీ దుశ్చర్యకు పాల్పడినట్టు భావించాలని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచినవారు, పోటీచేసిన అభ్యర్థులు అందరూ కూడా బొత్స పేరును ఏకగ్రీవంగా నిలబెట్టారని జగన్ చెప్పుకొచ్చారు. బొత్స గెలుపుకు మీరంతా అండగా ఉండాలని నేతలను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యా బలం లేదని.. నైతికలు విలువలు పాటిస్తే గనుక టీడీపీ పోటీ పెట్టకూడదని ఆయన అన్నారు.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఏర్పడింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పరిశీలన, ఉపసంహరణ మిగిలింది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను టీఆర్‌ఎస్ మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ…
తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామా? వద్దా..? అనే విషయంపై కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జన పడుతోంది… లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ విషయంపై ఇవాళ పీఏసీ సమావేశమై చర్చింది.. అయితే, పోటీపై ఎలాంటి నిర్ణయానికి రానట్టుగా తెలుస్తోంది.. ఇక, నల్గొండలో పోటీ చేయాలా..? వద్దా..? అనేది జిల్లా నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం అని ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి తెలిపినట్టుగా సమాచారం.. మరోవైపు..…