విశాఖలో ఉత్తరాంధ్ర వైసీపీ న్యాయ విభాగం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యన్నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది IB సిలబస్ తో ఫస్ట్ క్లాస్ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం అప్పులు చేశామని ఆయన అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ రాకుండా వుండాలంటే మరోసారి వైసీపీ అధికారం చేపట్టాలని, ప్రతిపక్షాలు గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి ప్రభుత్వం ను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తాయని ఆయన వెల్లడించారు.
అంతేకాకుండా.. ‘కుట్రలను తిప్పికొట్టేందుకు పార్టీ న్యాయవాద విభాగం అప్రమత్తంగా వుండాలి…. ఎప్పటి పిటీషన్ లను అప్పుడే ధీటుగా ఎదుర్కోవాలి…. విశాఖ ను రాజధాని గా ప్రకటించడం ఎవరి మీదో కక్షతో చేసిన నిర్ణయం కాదు….అభివృద్ధి వికేంద్రీకరణ కోసం చేసిన ఆలోచన…. లక్ష 19వేల కోట్ల తో అమరావతి నిర్మాణ ప్రణాళిక 15ఏళ్ల కాలంలో 20లక్షల కోట్లకు పెంచే ప్రయత్నం చేశారు…. లక్షల కోట్లు పెట్టీ 50 వేల ఎకరాలలో అభివృద్ధి చేయడం అవసరమా….?. 10 వేల కోట్లు పెడితే వైజాగ్ దేశం గర్వించదగ్గ రాజధానిగా మార్చడం అవసరం అని భావించాం…. దుష్ట శక్తులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం మేధావులు పై వుంది.’ అని మంత్రి బొత్స అన్నారు.
Travis Head-IPL 2024: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరిన ప్రపంచకప్ హీరో.. ఇక పరుగుల వరదే!