IND vs AUS: నీకు అవసరమా?.. పాంటింగ్‌పై ఫైరైన ఆసీస్ మాజీ క్రికెటర్!
- విమర్శలకు గురవుతున్న పాంటింగ్
- పాంటింగ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన లీ
- నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శలకు గురవుతున్నాడు. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరుచుకుపడగా.. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ లీ కూడా పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లాంటి పెద్ద సిరీస్‌కు ముందు అపహాస్యంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన కోహ్లీని రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదన్నాడు. ఆస్ట్రేలియా-భారత్ టెస్ట్ సిరీస్ రసవత్తరంగా ఉంటుందని తాను భావిస్తున్నా అని షేన్ లీ పేర్కొన్నాడు.
ఫాక్స్ క్రికెట్ పోడ్‌కాస్ట్ ‘ది ఫాలో ఆన్’లో షేన్ లీ మాట్లాడుతూ… ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది. ఈ సమయంలో రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదు. ఒక్కసారి విరాట్ కుదురుకున్నాడంటే.. ఆస్ట్రేలియాకు మరోసారి చుక్కలు చూపిస్తాడు. టెస్ట్ సిరీస్ రసవత్తరంగా ఉంటుందని భావిస్తున్నా. భారత్-ఏ, ఆస్ట్రేలియా-ఏ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్టుల్లోనే బాల్ టాంపరింగ్ వివాదం వచ్చింది. ఇప్పుడు కోహ్లీని ఉద్దేశించి పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఆసీస్‌కు అద్భుత బౌలింగ్ ఎటాక్ ఉంది. కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, లైయన్ బాగా బౌలింగ్ చేస్తున్నారు’ అని అన్నాడు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
Also Read: Gold Rate Today: ఇది కదా ‘బంగారం’ లాంటి వార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన గోల్డ్ రేట్స్!
న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 0-3తో కోల్పోయింది. కివీస్ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన రోహిత్ సేన.. ఇప్పుడు కీలక సమరానికి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం అవుతుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆసీస్ చేరుకున్న భారత్.. ప్రాక్టీస్ కూడా ఆరంభించింది. గత రెండుసార్లు భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలుచుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!