టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై చేసిన వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శలకు గురవుతున్నాడు. ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరుచుకుపడగా.. తాజాగా ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ లీ కూడా పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లాంటి పెద్ద సిరీస్‌కు ముందు అపహాస్యంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన కోహ్లీని రెచ్చగొట్టేలా మాట్లాడటం మంచిది కాదన్నాడు.…