బిగ్ బాస్ సోహెల్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బూట్‌కట్ బాలరాజు మూవీ ఓటీటీలోకి వస్తోంది. మరో మూడు రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.మొదట మార్చి 1 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని భావించారు. కానీ అనుకున్నదాని కంటే ముందే అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.బ ఈ విషయాన్ని శుక్రవారం (ఫిబ్రవరి 23) అధికారికంగా వెల్లడించారు. సోమవారం (ఫిబ్రవరి 26) సాయంత్రం 6 గంటల నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చిన బూట్‌కట్ బాలరాజు మూవీని సోహెల్ బాగానే ప్రమోట్ చేశాడు.కానీ థియేటర్లకు మాత్రం ప్రేక్షకులను రప్పించలేకపోయాడు. రిలీజైన రోజు నుంచే ప్రేక్షకులు ఎవరూ కూడా ఈ సినిమాను పట్టించుకోలేదు. దీంతో సోహెల్ మీడియా ముందు కంటతడి పెట్టుకున్నాడు. మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తున్నా ప్రేక్షకులు ఆదరించడం లేదని భాదపడ్డాడు.. ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లేకపోవడంతో థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది..
ఈ సినిమాలో సోహెల్ తోపాటు మేఘలేఖ, సునీల్, ఇంద్రజ మరియు సిరి హనుమంతు వంటి తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. శ్రీ కోనేటి సినిమాను డైరెక్ట్ చేశారు. భీమ్స్ సీసిరోలియో ఈ మూవీకి మ్యూజిక్ అందించగా.. మహ్మద్ పాషా నిర్మించాడు.ఊరి పెద్ద పటేలమ్మ (ఇంద్రజ ) కూతురు మహాలక్ష్మిని (మేఘమాల) ప్రేమిస్తాడు బాలరాజు. వారి ప్రేమకు పటేలమ్మ ఒప్పుకోదు. సర్పంచ్ ఎన్నికల్లో తనపై పోటీ చేసి గెలిస్తేనే కూతురు మహాలక్ష్మిని నీకు ఇచ్చి పెళ్లిచేస్తానని బాలరాజుతో ఛాలెంజ్ చేస్తుంది పటేలమ్మ. ఆమె ఛాలెంజ్‌ను బాలరాజు అంగీకరించాడా..సర్పంచ్ ఎన్నికల్లో గెలిచి మహాలక్ష్మి ప్రేమను సొంతం చేసుకున్నాడా..లేదా? అన్నదే బూట్ కట్ బాలరాజు మూవీ కథ. ఈ సినిమాలో సోహెల్ కామెడీ బాగున్నా కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.