Bonda Uma: త్రీమెన్ కమిటీ ముందుకు బోండా ఉమా.. తన వ్యాఖ్యలపై క్లారిటీ.. ప్రతి మాటకు రికార్డు ఉంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bonda Uma: ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరైన నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు, రాజకీయ చర్చలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు స్పందించారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదని, భవిష్యత్తులో కూడా టీడీపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇకపై వైసీపీ నేతలు పాల్గొనే సమావేశాలకు హాజరుకానని కూడా ప్రకటించారు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చి.. పార్టీ నేతలకు తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్లడం పూర్తిగా వ్యక్తిగత, మర్యాదపూర్వక కార్యక్రమమని తెలిపారు. ఆ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉండటంతో వారిని కలవాల్సి వచ్చిందని, దానికి రాజకీయ రంగు పులమడం సరికాదన్నారు.
సంస్మరణ సభలో జరిగిన పరిణామాలను కొన్ని దుష్టశక్తులు కావాలనే వక్రీకరించి ప్రచారం చేశాయని బోండా ఉమా ఆరోపించారు. తనకు, టీడీపీకి మధ్య విభేదాలు సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను మాట్లాడిన ప్రతి మాటకు రికార్డు ఉందని, చెప్పని విషయాలను కూడా చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలో తాను 25 సంవత్సరాలుగా కొనసాగుతున్నానని, ఈ కాలంలో ఒక్కసారి కూడా పార్టీ లైన్ దాటలేదని బోండా ఉమా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు పార్టీ కష్టకాలంలో తాను ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పార్టీ కోసం పనిచేశానని గుర్తు చేశారు.
Also Read
- YS Jagan: డీఎస్సీ వివాదం.. లోకేష్ రాజీనామా.. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
- Heavy Rain Alert: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
- Tobacco Farmers: పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అండ.. కీలక ప్రకటన..
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు తాను ఉదయం 11 గంటలకు వెళ్లి, మధ్యాహ్నం 12 గంటలకే బయటకు వచ్చానని చెప్పారు ఉమా.. ఆ సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు తన వద్దకు వచ్చి పలకరించారని, అంతకుమించి ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని వివరించారు. ఈ అంశంపై ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడులకు పూర్తి వివరణ ఇచ్చినట్లు ఉమా తెలిపారు. అయినప్పటికీ జరిగిన విషయాలను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల అనవసర అపోహలు ఏర్పడ్డాయని అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటానని బోండా ఉమా స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని, ఇకపై వైసీపీ నేతలు ఉన్న కార్యక్రమాలకు వెళ్లబోనని వెల్లడించారు. ఇక, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌లను కలిసి ఈ అంశంపై వివరణ ఇస్తానని తెలిపారు. పార్టీపై తనకు పూర్తి నిబద్ధత ఉందని, టీడీపీ కష్టకాలంలో ఎలా అండగా నిలిచానో, భవిష్యత్తులో కూడా అదే విధంగా పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు బోండా ఉమామహేశ్వరరావు..
తాజావార్తలు
-
Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి కీలక నిర్ణయం.. పార్లమెంట్లో సంచలన ప్రకటన
-
Fielder Clicks Finger Video: క్రికెట్ చరిత్రలోనే వినూత్న చీటింగ్.. వేలితో చిటికేసి బ్యాటర్‌ను అవుట్ చేశాడు.. వీడియో వైరల్..
-
YS Jagan: డీఎస్సీ వివాదం.. లోకేష్ రాజీనామా.. సీబీఐ విచారణకు జగన్ డిమాండ్
-
Bonda Uma: త్రీమెన్ కమిటీ ముందుకు బోండా ఉమా.. తన వ్యాఖ్యలపై క్లారిటీ.. ప్రతి మాటకు రికార్డు ఉంది..!
-
8000mAh బ్యాటరీ, 7-అంగుళాల OLED డిస్ప్లే, 50MP కెమెరా.. Redmi నుంచి కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు..
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!