అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై జిల్లా స్థాయిలో బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలతో జరిగిన అంతర్మథన సమావేశం తర్వాత బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బొమ్మై ఆరోపించారు. వారిని వ్యతిరేకించే ప్రతి గొంతును అణిచివేసేందుకు ప్రయత్నిస్తూ వాక్‌స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు.. నేను చెబుతున్నాను.. ప్రజలు త్వరలో ఎమర్జెన్సీ వంటి పరిస్థితిని చూస్తారు’ అని బొమ్మై జోస్యం చెప్పారు.