పాన్ ఇండియన్ హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రేక్షకులను మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీగా పాపులారిటిని అయితే ఏర్పరచుకున్నాడు. ఈ మూవీతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు ను తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారని తెలుస్తుంది.. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం బాగా వైరల్ అవుతుంది.అది ఏమిటి అంటే ఎన్టీఆర్ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.. కాగా ఇప్పటికే పలు స్టార్ హీరోలకు సెపరేట్ ప్రోడక్షన్ హౌజ్లు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే రామ్ చరణ్ కూడా ఒక కొత్త బ్యానర్ను స్థాపించారు. అలాగే ప్రభాస్ కి యూవీ క్రియేషన్స్ , మహేష్ కి ఎంబీ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ కూడా సొంత సంస్థను స్థాపించనున్నారని సమాచారం.ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త సినిమాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్ ని ఆయన ప్రోత్సహించబోతున్నారని తెలుస్తుంది.ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్టు సమాచారం.. అంతేకాదు ఎన్టీఆర్ నిర్మాతగా తన మొదటి చిత్రాన్ని ప్రముఖ హీరో అయిన నాని తో చేయనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాలి . ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన తరువాత సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నట్లు సమాచారం