శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నై-హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌లో బాంబు పెట్టామంటూ బెదిరింపు కాల్ ఓ ఆగంతకుడు కాల్ చేశాడు. దీంతో ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్టు అధికారుల ఫిర్యాదు మేరకు ఆర్‌జీఐఏ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఆర్‌జీఐఏ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయంలో ఇప్పటి వరకు ఎలాంటి బాంబును, అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని అధికారులు తెలిపారు.
Also Read : Smart Meters: స్మార్ట్ విద్యుత్ మీటర్లుతో ఎన్నో ఉపయోగాలు.. ఆందోళన వద్దు..
అయితే.. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్నట్లు సీఐఎస్‌ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారుల గుర్తించారు. దీంతో.. చెన్నైలో సీనియర్ ఇంజనీరింగ్‌గా పనిచేస్తున్న అజ్మీరా భద్రయ్య బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు కనిపెట్టారు. ఫ్లైట్ జర్నీకి లేటుగా రావడంతో భద్రయ్యను ఎయిర్‌లైన్స్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఈ బెదిరంపు కాల్ చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. అయితే.. అజ్మీరా భద్రయ్యను ఆర్‌జీఐఏ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.