Bomb In Flight: ఢిల్లీ నుండి వడోదరకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో బాంబు బెదిరింపు బుధవారం ప్రయాణికులలో భయాందోళనలకు కారణమైంది. వివరాల ప్రకారం., విమానంలో ఉన్న ఓ టిష్యూ పేపర్ పై ఒక నోట్ గా “బాంబు” అనే పదాన్ని రాసి ఉండి గమనించడంతో ఈ సంఘటనకు కారణమైంది. విమానంలోని టాయిలెట్ లో ఆ నోట్ దొరికింది. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నోట్ దొరికిన తర్వాత విమానంలో సదరు అధికారులు వెతికారు. అయితే, అనుమానాస్పదంగా అక్కడ ఏమీ దొరకలేదు.
విమాన సిబ్బంది టిష్యూ పేపర్ ను గుర్తించినప్పుడు విమానం టేకాఫ్ చేయడానికి సిద్ధంగా ఉందని ఒక అధికారి తెలిపారు. తదనంతరం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ప్రయాణీకులను విమానంలో నుండి దిగిపోవాలని కోరారు అధికారులు. అనంతరం ప్రయాణికులు మరో విమానంలో వడోదరకు బయలుదేరారు.
ఈ సంఘటన తరువాత, ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో, “బయలుదేరే ముందు 15 మే 2024 న ఢిల్లీ నుండి వడోదరకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI819 లో నిర్దిష్ట భద్రతా హెచ్చరిక కనుగొనబడింది. అవసరమైన ప్రోటోకాల్ ను అనుసరించి ప్రయాణీకులందరినీ సురక్షితంగా తీసుకెళ్లామని., భద్రతా సంస్థల తప్పనిసరి తనిఖీల కోసం విమానాన్ని మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లారని తెలుపుతూ.. ఈ ఊహించని అంతరాయం వల్ల మా అతిథులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి గ్రౌండ్లోని మా సహచరులు నిర్ధారించుకున్నారని ఎయిర్లైన్స్ తెలిపింది. ఎయిర్ ఇండియా తన ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ప్రత్యేక విమానంలో ప్రయాణికులను వడోదరకు తరలించారు.