Huma Qureshi joins Yash Toxic: ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కెవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలొచ్చాయి. టాక్సిక్‌లో బాలీవుడ్ భామ కరీనా కపూర్ నటించనుందని ముందునుంచి నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.
తాజాగా టాక్సిక్‌లో మరో బాలీవుడ్ భామ నటించనుందని తెలుస్తోంది. ఓ ముఖ్య పాత్రను హ్యూమా ఖురేషీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. దర్శకురాలు స్టోరీ చెప్పగా.. ఆమెకు బాగా నచ్చి ఒకే చెప్పారట. టాక్సిక్‌లో హ్యూమా ఖురేషీ పాత్ర పూర్తిగా యాక్షన్ కోణంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. టాక్సిక్‌లో నయనతార, కరీనా కపూర్, హ్యూమా ఖురేషీ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
Also Read: Trisha Krishnan: త్రిష ‘ఐడెంటిటీ’ పూర్తి!
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా టాక్సిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్నట్లు తెలిసింది. అందుకే యూఎస్‌లోని కొన్ని ప్రముఖ అంతర్జాతీయ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలతో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరుపుతోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వెర్షన్, ఇంటర్నేషనల్ వెర్షన్‌గా రెండు రూపాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న విడుదల కానుంది.