BMW: ఇది కారు కాదు.. ఊసరవెల్లి.. 240 రంగులు మారుస్తుందట..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMW New Car: ఊసరవెల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు అనుగుణంగా అది ఎన్ని రంగులు మారుస్తుందో మనం వినే ఉంటాం. అయితే పరిస్థితులకు అనుగుణంగా రంగులు మార్చే కారును మీరు ఎప్పుడైనా చూశారా. బీఎండబ్ల్యూ కొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చిన కారు ఊసరవెల్లి తరహాలో రంగులు మారుస్తోంది. మీరు వింటుంది నిజమేనండోయ్. ఎందుకంటే బీఎండబ్ల్యూ అత్యాధునిక సాంకేతికతతో పాటు అత్యంత ఆకర్షణీయమైన లుక్‌లో ఈ కారును ఆవిష్కరించింది. డ్రైవర్ మూడ్‌కు అనుగుణంగా ఈ కారు 240 రంగులను మార్చుకోగలదు. ఈ కారు 2025 నుంచి మన దేశ మార్కెట్లో అందుబాటులో ఉంటుందని బీఎండబ్ల్యూ వివరించింది.
Read Also: Spring Fields: 800 ఏళ్ల ఇస్లామిక్ స్వర్ణయుగాన్ని ప్రదర్శించిన స్ప్రింగ్‌ఫీల్డ్స్ ఇన్స్టిట్యూట్
Also Read
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
- Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
లాస్‌వెగాస్‌లో జరుగుతున్న CES ఈవెంట్లో బీఎమ్‌డబ్ల్యూ ఈ రంగులు మార్చే కారును ప్రదర్శించింది. ఐ విజన్ డీ పేరుతో లాస్ వెగాస్‌లోని CES ఈవెంట్లో బీఎండబ్ల్యూ ఈ కారును ప్రదర్శించింది. ఈ మోడల్ కారుకు సంబంధించి మూడు బాడీ డిజైన్లను పరిచయం చేసింది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది దాని రంగును అదే మార్చుకోగలదు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 240 రకాల రంగులను మార్చుకోగలదు. ప్రస్తుతం ప్రోటోటైప్ అయినప్పటికీ కంపెనీ దీని ఉత్పత్తికి ప్లాన్ చేస్తోంది. ప్రజల స్పందన చూసి త్వరలో ప్రారంభించనుంది. ఈ కార్ టెక్నాలజీ ఆటో ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దాదాపు 240 రంగులను మార్చుకోవడం అనేది బీఎండబ్ల్యూ ఐ విజన్ డీ కారుకు Ink టెక్నాలజీతో సాధ్యమైంది. ఈ టెక్నాలజీని కారులోని అన్ని భాగాలలో ఉపయోగించారు. ప్రతి ప్యానెల్లో 32 రంగుల ఎంపికలు ఉన్నాయి. తద్వారా మీరు ఈ కారును ఒకే సమయంలో వేర్వేరు రంగులలోకి మార్చవచ్చు. ఈ కారులో రంగు మారడమే కాకుండా అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు ప్రొజెక్టింగ్ డ్రైవెన్ డేటా టెక్నాలజీని కూడా కలిగి ఉండబోతుంది. దాని సహాయంతో కారు విండ్‌షీల్డ్‌పైనే డిజిటల్ ఫార్మాట్లో డ్రైవింగ్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పొందగలుగుతారు. ఇది నావిగేషన్, స్పీడ్, మైలేజ్ వంటి సమాచారాన్ని విండ్షీల్డ్లోనే ప్రదర్శిస్తుంది. తద్వారా మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదు. అయితే ఈ కారు విడుదల తేదీకి సంబంధించిన తేదీని బీఎండబ్ల్యూ కంపెనీ రివీల్ చేయలేదు. దీంతో కారు ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Dee comes full colour 🔴⚪️🟡🟢🔵
Introducing the BMW i Vision Dee with full-colour E Ink technology. The tech allows for a vibrant, individually configurable exterior with up to 32 different colours. #BMWGroup #THEiVisionDee #TheUltimateCompanion #CES2023 #innovation pic.twitter.com/ynMq0prCCN— BMW Group (@BMWGroup) January 6, 2023
తాజావార్తలు
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!