NTV Telugu Site icon

World Cup 2023: కోల్‌కతాలో బ్లాక్లో టిక్కెట్ల అమ్మకాలు.. బీసీసీఐకి పోలీసులు నోటీసులు జారీ

Bcci Notie

Bcci Notie

World Cup 2023: ప్రపంచ కప్లో భాగంగా.. ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టిక్కెట్ల అమ్మకాలు గోల్ మాల్ అయ్యాయి. టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీకి నోటీసులు పంపించారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలపై సమాచారం తెలపాలని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Read Also: Germany: హాంబర్గ్ విమానాశ్రయంలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. దుండగుడితో చర్చలు..

శనివారం సాయంత్రం జారీ చేసిన నోటీసులో.. టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేయడంపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్న మైదాన్ పోలీస్ స్టేషన్ అధికారికి పత్రాలను సమర్పించాలని బీసీసీఐ అధ్యక్షుడిని కోరినట్లు ఆయన తెలిపారు. మంగళవారం మైదాన్ పీఎస్‌లోని విచారణ అధికారికి వ్యక్తిగతంగా లేదా తన సంస్థలోని సమర్థుడైన వ్యక్తి ద్వారా టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన సంబంధిత పత్రాలు, సమాచారాన్ని అందించాలని బీసీసీఐ అధ్యక్షుడికి నోటీసు పంపారు.

Read Also: Nepal Earthquake: నేపాల్‌లో భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఇదిలా ఉంటే.. ఈ బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారంపై కోల్‌కతా పోలీసులు ఇప్పటివరకు 19 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 108 టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు సంబంధించి ఏడు కేసులు నమోదు చేశారు.