NTV Telugu Site icon

TS BJP: రాష్ట్రంలో బైపోల్ ఎన్నికల్లో బీజేపీనే గెలిచింది.. కాంగ్రెస్ కాదు..!

Ts Bjp

Ts Bjp

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి రోజురోజుకు ఓటు బ్యాంక్ పెరుగుతుందని తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ లేని చోట్ల అధికార మదం, డబ్బు మదంతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది.. అంతేకానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా గెలవలేదు.. అసలు ఆ పార్టీ రాష్ట్రంలో ఎక్కడ కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యనించారు. ఒక బీజేపీ కార్పొరేటర్ మీద కేసులు పెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. గజ్వేల్ లో శివాజీ విగ్రహాన్ని అపవిత్రం చేశారని నిందితుడిని అప్పగిస్తే వారిపైనే తిరిగి కేసు పెట్టి జైలుకు పంపించారు అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ మాపై ఎన్నో ఆరోపణలు చేస్తోంది.. మేం మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తామని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళఖాతంలో కలుపుతామని ఆయన అన్నారు.

Read Also: Vishwak Sen – Sai Rajesh: బేబీ డైరెక్టర్ కి విశ్వక్ కౌంటర్లు.. ఇదెక్కడి రచ్చ మాస్టారూ?

తెలంగాణలో బీజేపీకి ఈ స్థాయిలో జోష్ వచ్చిందంటే దానికి కారణం బండి సంజయ్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ ను చూసి కళ్ళలో నీళ్ళు తిరిగితే బాత్రూంలో కి వెళ్లి ఏడ్చి వచ్చాను.. కేసీఆర్ కి వ్యతిరేకంగా బండి సంజయ్ తీవ్రస్థాయిలో పోరాటం చేశారు.. బండి సంజయ్ ను పార్టీ గుండెల్లో పెట్టుకోవాలి అని ఆయన తెలిపారు. అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను పాటించాలి.. మునుగోడులో నైతిక విజయం సాధించాము.. మునుగోడులో గెలవడానికి కేసీఆర్ వంద మంది కౌరవులను పంపించారు.. రాజగోపాల్ రెడ్డి సత్తా ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని ఆయన పేర్కొన్నారు.

Read Also: Uttar Pradesh: యూపీలో దారుణం.. సోదరి తలతో రోడ్డుపైకి..!

తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించాలనే మనమంతా పోరాడుతున్నామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఇతర పార్టీల నుంచి ఎంతో మంది చేరింది కూడా అందుకే.. పాత, కొత్త అనే తేడాలు లేకుండా పోరాడి కేసీఆర్ ను గద్దె దింపాలి.. రాబోయే వంద రోజుల్లో నిద్రపోకుండా కేసీఆర్ ను గద్దె దించి అధికారంలోకి రావాలని ఆమె తెలిపారు. బండి సంజయ్ అధ్యక్షతన బీజేపీకి ఊపొచ్చింది.. దాన్ని ఇంకా కొనసాగించాలి.. ప్రతి ఇక్క నేత శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకుని పోరాడాలి అని డీకే అరుణ అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే.. తెలంగాణలో కేసీఆర్.. ఎందుకు భుజాలు చరుచుకుంటున్నాడు.. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయి.. ఈ రెండు కలిసి బీజేపీ గ్రాఫ్ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయని ఆమె వెల్లడించింది.

Read Also: Project k: ప్రభాస్ ఫ్యాన్సా.. మజాకా..ఆకాశ వీధిలో ప్రాజెక్ట్-K టీం కు గ్రాండ్ వెల్కమ్..

తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు అని తరుణ్ చుగ్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలని చూస్తున్నారు. అహంకారపూరితమైన వ్యక్తిని తరిమికొట్టాలని కోరుకుంటున్నారు.. అవినీతి పాలనను పారద్రోలాలని ప్రజలు చూస్తున్నారు.. తెలంగాణ ప్రజలు ఈ సర్కార్ ను ఊడగొట్టేందుకు సిద్ధమయ్యారు.. రాబోయే వంద రోజుల్లో బీజేపీ అధికారంలోకి రానుంది అంటూ తరుణ్ చుగ్ పేర్కొన్నారు.