Vishwak Sen vs Sai Rajesh: తెలుగు యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం రవితేజ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అయితే అసలు సంబంధం లేకుండా విశ్వక్ సేన్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో కలకలం రేపింది. ముందుగా తన ట్విట్టర్ ఖాతాలో నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశాడు అసలు సందర్భం లేకుండా ఇలా నవ్విన ఎమోజీ షేర్ చేయడంతో అభిమానులకు అర్థం కాక రకరకాల కామెంట్లు పెట్టారు. ఆ తర్వాత కాసేపటికి ‘నో అంటే నో అంతే! ఇది మగవాళ్లకు కూడా వర్తిస్తుంది, కాబట్టి అరవడం మానేయండి, కాస్త ప్రశాంతంగా ఉండండి, మనందరం ప్రశాంత వాతావరణంలో ఉన్నాం, దాన్ని అలాగే ఉండనివ్వండి, రెస్ట్ తీసుకోండి’ అని మరో ట్వీట్ చేశాడు. ఆయన చేసిన ఆ ట్వీట్ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
Sai Dharam Tej: అరసవల్లిలో ధరమ్ తేజ్.. దాని గురించే ఆలోచిసున్నారట!
అయితే ఈ ట్వీట్ ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ దర్శకుడు సాయి రాజేష్‌ని ఉద్దేశించి చేసినట్టు కొందరు విశ్వక్ ట్వీట్ కింద కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఓ యువ నటుడు తన స్క్రిప్ట్ వినడానికి కూడా నిరాకరించి తనను అవమానించాడని సాయి రాజేష్ ఈ మధ్య వెల్లడించాడు. అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. సాయి రాజేష్ అప్పుడు కధ చెప్పడానికి ట్రై చేస్తే వినకుండానే అవమానించింది విశ్వక్ సేన్ అని ఇప్పుడు అల్లు అర్జున్ అప్రిసియేషన్ మీట్ అనంతరం ఆయన పరోక్షంగా స్పందించాడని నెటిజన్లు అంటున్నారు. ఇక విశ్వక్ ట్వీట్ కి సాయి రాజేష్ కూడా స్పందించాడని అంటున్నారు. యా నీ ట్వీట్లు చదువుతున్నా, గో ఎహెడ్ అంటూ ఆయన ట్వీట్ చేయడంతో ఇది విశ్వక్ ను ఉద్దేశించే చేశాడని అంటున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
"No means no" applies to men as well, so let's keep it cool and refrain from shouting. We're all about that peaceful vibe here, so let's just relax. ✌️
— VishwakSen (@VishwakSenActor) July 20, 2023
Yeah…Go ahead…Iam reading ur tweets…
— Sai Rajesh (@sairazesh) July 20, 2023